మ‌హారాష్ట్ర‌లో 500 దాటిన క‌రోనా కేసులు

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. శుక్ర‌వారం రాత్రి నుంచి శ‌నివారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మ‌రో 47 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మ‌హారాష్ట్ర‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 537కు చేరింది. గ‌త 12 గంట‌ల్లోనే 28 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింద‌ని, వారిలో 15 మంది ముంబై మెట్రోపాలిట‌న్ ప్రాంతానికి చెందిన‌వారు కాగా మ‌రో ఇద్ద‌రు పుణెకు చెందిన‌వారని మ‌హారాష్ట్ర ప్ర‌జా ఆరోగ్య విభాగం ప్ర‌క‌టించింది. అదేవిధంగా అమ్రావ‌తి, పింప్రి, చించ్‌వాడ్‌ల‌కు చెందిన వారికి కూడా ఒక్కొక్క‌రి చొప్పున క‌రోనా వైర‌స్ సోకింద‌ని వెల్ల‌డించింది.