ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకట రమణ, సీఎస్ నీలం సాహ్ని, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు హాజరయ్యారు. కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న వైద్య ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిగా జీతాలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. కరోనా నివారణ చర్యలపై సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
కరోనా నివారణకు ముందుండి పనిచేస్తున్న వారికి పూర్తి జీతాలివ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఈ మూడు కేటగిరీల్లో సిబ్బందికి పూర్తిగా జీతాలు చెల్లించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా కొద్దిరోజులుగా దేశంలోని అన్ని రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కొంతమేర కోత విధించి విడతలవారీగా చెల్లించాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది.